యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ట్రైలర్

యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ట్రైలర్

Published on Jan 17, 2024 6:16 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా యువ దర్శకుడు అరుణ్ మతేశ్వరన్ తెరకెక్కించిన తాజా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ ఇప్పటికే తమిళ్ లో రిలీజ్ అయి మంచి టాక్ తో కొనసాగుతోంది.

విషయం ఏమిటంటే, నేడు కొద్దిసేపటి క్రితం ఈ మూవీ యొక్క తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ని కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసారు. ఇక ట్రైలర్ లో టైటిల్ రోల్‌లో ధనుష్ పరిచయం చూడవచ్చు మరియు బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని స్వాతంత్రోద్యమానికి ముందు సమయానికి ఇది మనల్ని తీసుకువెళుతుంది. ధనుష్ తన గ్రామాన్ని దోచుకోవడానికి ప్రయత్నించే వలసవాదులను ఎదుర్కొంటూ స్థానిక తిరుగుబాటు నాయకుడిగా కనిపించారు. అతన్ని బ్రిటీష్ వారు డెకాయిట్ అని మరియు స్థానికులు అతన్ని దేశద్రోహి అని పిలుస్తుంటారు. ఇక ట్రైలర్ లో ధనుష్ యాక్టింగ్, స్టైల్, మాస్ ఫైట్స్ ఎంతో బాగున్నాయి.

అలానే ధనుష్ విభిన్న అవతారాలలో కనిపించారు. అలానే ట్రైలర్ లో ప్రియాంక మోహన్ మాస్ అవతార్ లో కనిపించగా, సందీప్ కిషన్ మరియు డాక్టర్ శివ రాజ్ కుమార్ కూడా కనిపించారు. ఇక ట్రైలర్ లో గ్రాండియర్ విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో అలరించింది. మొత్తంగా కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటూ మూవీ పై బాగా అంచనాలు ఏర్పరిచింది. తెలుగులో జనవరి 25న గ్రాండ్ గా సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ మల్టిప్లెక్స్ ప్రైవేట్ లిమిట్ వారు కెప్టెన్ మిల్లర్ ని రిలీజ్ చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు