
నటుడు మరియు దర్శక నిర్మాత అయిన హరినాథ్ పొలిచర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “మేజర్ రానా ప్రతాప్”. ఈ చిత్రాన్ని ఆయనే దర్శకతం వహించి నిర్మిస్తున్నారు. ఆర్మీ మేజర్ యూనిఫామ్ లో సెల్యూట్ చేస్తూ నిలుచున్న హరినాథ్ ఫొటోని మూవీ ఫస్ట్ లుక్ గా చిత్ర బృందం విడుదల చేసింది.
దేశభక్తి ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రముఖ సీనియర్ హీరో సుమన్ తో పాటు బాలీవుడ్ నటుడు దర్శకుడైన పునీత్ ఇస్సార్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.