తెలుగు సినిమా తమిళ, మలయాళంలో వర్కౌట్ అవుతుందా ?

Published on May 29, 2019 12:30 am IST

నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో రూపొందిన ‘కేరాఫ్ కంచెర పాలెం’ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల హృదయాలను కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ పై ‘రానా దగ్గుబాటి’ సమర్పించిన ఈ సినిమా పై ఓ నిర్మాత కూడా మనసు పారేసుకున్నాడు. అందుకే ఇప్పుడీ సినిమా తమిళ, మలయాళ భాషల్లో రీమేక్‌ కానుంది.

నిర్మాత యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు. ‘కేరాఫ్‌ కంచెరపాలెం’లోని చాలా సన్నివేశాలకు యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి కనెక్ట్‌ అయ్యారట. అందుకే సురేశ్‌ బాబు దగ్గరికెళ్లి ఫ్యాన్సీ రేట్‌ చెల్లించి ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రం తమిళ, మలయాళ రైట్స్‌ను సొంతం చేసుకున్నాడట.

కాగా ఇప్పటికే తమిళ్ వర్షన్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశారు. తమిళంలో పేరు పొందిన నటీనటులు ఈ సినిమాలో నటించనున్నారు. అలాగే మలయాళ వెర్షన్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా అతి త్వరలో కంప్లీట్‌ చేయనున్నారు. మొత్తానికి ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ తమిళ్ మలయాళ ప్రేక్షకులను కూడా పలకరించనుంది. కానీ తెలుగు సినిమా తమిళ, మలయాళంలో వర్కౌట్ అవుతుందా ? అనేదే చూడాలి.

సంబంధిత సమాచారం :

More