
ఈ మధ్య మా సామాజిక వర్గం వారిని కించపరిచేలా మీ చిత్రంలో సన్నివేశాలు కూర్చారంటూ కోర్టులో కేసులు పెట్టి కూర్చోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడు ఈ విధమైన కేసు వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాపై నమోదు చేశారు. యాదవ వర్గాన్ని అవమానించేలా సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారంటూ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.
ఈ చిత్రాన్ని తమకు చూపించి తాము చెప్పిన అభ్యంతకర సన్నివేశాలను తొలగించాలని కోరారు. అయితే దీనిపై నిర్మాతగానీ, దర్శకుడుగానీ స్పందించలేదు. ఈ సినిమాలో వరుణ్ సరసన పూజా హేగ్దే నటించింది