కమల్ హాసన్ పై కేసు నమోదు !

తమిళనాడులోని ట్యుటికోరిన్ లో జరిగిన స్టెరిలైట్ నిరసనలో జరిగిన పోలీస్ కాల్పుల్లో 11మంది మరణించగా 10ల సంఖ్యలో సామాన్యులు తీవత గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. వీరిని పరామర్శించేందుకు నటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ ఈరోజు ఉదయం ట్యుటికోరిన్ వెళ్లారు.

ట్యుటికోరిన్ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినా కమల్ హాసన్ అక్కడికి రావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బాధితుల్ని కలిసిన కమల్ అసలు ప్రజలపై కాల్పులు జరిపమని పోలీసులను ఎవరు ఆదేశించారో చెప్పాలని ప్రజలు కోరుతున్నారని, ఏదో నష్ట పరిహారం చెల్లించి ఊరుకుందామంటే కుదరదని, స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, దీనికి పర్యావసానంగా ప్రజలే ప్రభుత్వానికి పెద్ద శిక్ష వేస్తారని కమల్ అన్నారు.

Exit mobile version