తమిళంలో స్టార్ హీరో ఇమేజ్ ఉన్న హీరో శింబు, అలాగే ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గాన అనిరుధ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా ఆల్ ఇండియా డెమాక్రటిక్ ఉమెన్ అసోషియేషన్ వారు శింబు, అనిరుష్ లపైన కోయంబత్తూర్ లో కేసు ఫైల్ చేసాడు. దానికి కారణం శింబు – అనిరుధ్ కలిసి చేసిన బీప్ సాంగ్ బయటకి రావడం అందులో మహిళల గురించి చెడుగా ఉండడమే కారణం.
ఈ సాంగ్ లో ‘అమ్మాయిలని ప్రేమించి మోసపోయినప్పుడు వాళ్ళని తిట్టద్దు మామ, నిన్నే నువ్వే తిట్టుకోమామ’ అంటూ సాగే ఈ పాటలో అమ్మాయిలని కొన్ని చెడు విషయాలతో పోలుస్తూ పాట రాసారు. ఈ సాంగ్ ని సినిమా కోసం కంపోజ్ చేయలేదు. చాలా రోజుల కోసం శింబు అనిరుధ్ కలిసి ఈ పాటని కేవలం ఫన్ కోసం రికార్డ్ చేసారు. దానిని ఫ్రెండ్స్ కి ఇచ్చారు. అలా కొంతమంది నుంచి ఈ సాంగ్ వాట్స్ అప్ లో తిరుగుతోంది. ఆలాగే సోషల్ మీడియాలో ఇంటర్నెట్ లో దొరుకుతోంది. దాంతో మహిళలు, ఉమెన్ యాక్ట్, ఐపిసి 509, ఐపిసి 6, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద శింబు, అనిరుధ్ ల మీద కేసు నమోదు చేసారు.
