‘ఫ్యామిలీ స్టార్’ నుండి ఆకట్టుకుంటున్న ‘దేఖో రే దేఖో’ సాంగ్

‘ఫ్యామిలీ స్టార్’ నుండి ఆకట్టుకుంటున్న ‘దేఖో రే దేఖో’ సాంగ్

Published on Apr 2, 2024 10:23 PM IST

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ల లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించగా గోపీ సుందర్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి నేటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నాలుగవ సాంగ్ అయిన దేఖో రే దేఖో సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

ఆకట్టుకునే లిరిక్స్ తో అలరించే బీట్స్ తో సాగిన ఈ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ రచించగా హేమచంద్ర అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో బాగా వ్యూస్ రాబడుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఫ్యామిలీ స్టార్ ని ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సాంగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు