ఆ హీరోయిన్ రవితేజ సరసన నటించబోతోందా ?

ఆ హీరోయిన్ రవితేజ సరసన నటించబోతోందా ?

Published on Mar 20, 2018 11:00 AM IST

పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న కథను రవితేజతో చెయ్యబోతున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ క్యాథరిన్ థ్రెస నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.

రవితేజ ప్రస్తుతం ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల సినిమా, సంతోష్ శ్రీనివాస్ సినిమా చేస్తాడట ఈ హీరో. తాజాగా ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ తరువాత విజయ్ దేవరకొండ, నాని, సాయి ధరమ్ తేజ్ లతో వరుసగా సినిమాలు చేయనుంది. రవితేజ, సంతోష్ శ్రీనివాస్ సినిమాకు సంభందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాజా వార్తలు