మంచు విష్ణు సరసన కేథరిన్‌..?

మంచు విష్ణు సరసన కేథరిన్‌..?

Published on Jul 12, 2014 12:37 PM IST

catherine-tresa
తమిళంలో ఘన విజయం సాదించిన ‘మంజ’ చిత్రాన్ని తెలుగులో మంచు విష్ణు హీరోగా దర్శకరత్న దాసరి రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఈ చిత్రంలో మంచు విష్ణుకు జోడిగా కేథరిన్‌ తెస్రాను ఎంపిక చేశారని సమాచారం. జూలై 24వ తేది నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సింగల్ షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు.

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో కేథరిన్‌ తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత విడుదలైన ‘పైసా’ పరాజయం పాలవడంతో దాసరి సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.

‘మంజ’ రీమేక్ దాసరి దర్శకత్వం వహించబోయే 151వ సినిమా. తోలి సినిమా ‘తాత మనవడు’తో తెలుగు పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దాసరి 151వ సినిమా కోసం అదే తరహా(తాత మనవాళ్ళ) నేపధ్యం ఎంచుకోవడం విశేషం. ఈ సినిమాలో విష్ణు తాతగా దాసరి నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు