ప్రముఖ నటుడి మరణాన్ని ఇన్వెస్టిగేషన్ చేయనున్న సిబిఐ !


గతేడాది మార్చి 6వ తేదీన ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మణి అనుమానాస్పద రీతిలో మరణయించిం సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ మృతిని స్థానిక పోలీసులు కూడా అసహజ మరణం కిందే నమోదు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన మూర్తికి విష ప్రయోగమే కారణమనే వార్తలు కూడా వెలువడ్డాయి. కొన్నాళ్ళ పాటు కేసును దర్యాప్తు చేసిన పోలీసు శాఖ ఆయన మరణంలో ఎలాంటి మిస్టరీ లేదని కేవలం లివర్ సంబంధిత వ్యాధితోనే ఆయన మరణించారని హై కోర్టుకు తెలిపింది.

కానీ పోలీస్ శాఖ దర్యాప్తు పట్ల సంతృప్తి చెందని కళాభవన్ మణి భార్య నిమ్మి, సోదరుడు ఆర్ఎల్వి రామకృష్ణన్ కేసును సిబిఐ చేత దర్యాప్యు చేయించాలని కోర్టువారికి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని స్వీకరించిన కేరళ హై కోర్ట్ ఇంకో నెలలోపు కేసును ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టాలని సిబిఐని ఆదేశించింది. ఇకపై జరగబోయే సిబిఐ దర్యాప్తులో కళాభవన్ మరణానికి గల అసలైన కారణాలు బయటపడే అవకాశముంది. 46 ఏళ్ల కళాభవన్ మణి అన్ని దక్షిణాది భాషల్లో కలిపి సుమారు 200 సినిమాలు వరకు నటించారు.

Exit mobile version