‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ అటాక్’, ‘చిన్నదానా నీకోసం’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులను కంటిన్యూగా ఎంటర్టైన్ చేసి బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్స్ అందుకున్న యంగ్ హీరో నితిన్. వరుసగా రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో మెప్పించిన నితిన్ ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా నిన్ననే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కట్స్ విధించకుండా ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.
సెన్సర్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. పనీ పాటా లేకుండా ఖాళీగా తిరిగే సాధారణ యువకుడి లైఫ్ లో ఒక అసాధారణ సంఘటన జరిగితే అతని లైఫ్ ఎలా మారిపోయింది, తను మళ్ళీ మామూలు జీవితాన్ని సాగించడానికి ఏమేమి చేయాల్సి వచ్చింది అనేదే ఈ కొరియర్ బాయ్ కళ్యాణ్ కథ. ప్రేమ్ సాయి డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్ తో కలిసి నిర్మిస్తున్నాడు. యామి గౌతం హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సింగర్ కార్తీక్ మ్యూజిక్ అందించాడు.


