చిరు ఇంటిలో మరో మీటింగ్..!

Published on May 29, 2020 8:38 pm IST

నేడు చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. కరోనా క్రైసిస్ ఛారిటీ సభ్యులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ చారిటీ తరుపున సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే దశల వారీగా పంపిణీ జరిగింది. ఐనప్పటికీ ఇంకా సరుకులు అందని కార్మికులను గుర్తించి వారికి కూడా ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని వీరు తీర్మానించినట్లు సమాచారం.

ఇక బాలయ్య నిన్న చేసిన వ్యాఖ్యలపై ఈ మీటింగ్ లో చర్చ జరగలేదు అని తెలుస్తుంది. ఐతే తమ్మా రెడ్డి భరద్వాజ గత మీటింగ్స్ లో అవసరమైన వారిని పిలిచారని, బాలయ్య అవసరం ఉన్నప్పుడు ఆయన్ని కూడా ఆహ్వానిస్తారు అన్నారు. అలాగే దీనిని వివాదం చేయాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి చెప్పినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :

More