సిసిఎల్ : మరో మ్యాచ్ లో తెలుగు వారియర్స్ గెలుపు

సిసిఎల్ : మరో మ్యాచ్ లో తెలుగు వారియర్స్ గెలుపు

Published on Mar 2, 2024 12:33 AM IST

పదేళ్ల క్రితం మొదలైన సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) తాజాగా షార్జాలో పదో ఎడిషన్ ప్రారంభం అయింది. ఈ సీజన్‌లో తెలుగు వారియర్స్ టీమ్ విజయంతో టోర్నీని ప్రారంభించి మంచి విజయాలతో కొనసాగుతోంది. తాజాగా ఉత్కంఠ భరితంగా సాగిన తెలుగు వారియర్స్ వర్సెస్ పంజాబ్ ది షేర్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ విజయం సాధించారు.

తమన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో 106 రన్స్ ని చేజ్ చేసింది తెలుగు వారియర్స్. మొదటి ఇన్నింగ్స్ లో పంజాబ్ లీడ్ లో ఉన్నప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు వారియర్స్ ధీటుగా ఆడి ఇన్నింగ్స్ కి రెండు బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచి విజయఢంకా మోగించింది. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తమన్ ని వరించింది. సెకండ్ ఇన్నింగ్స్ తెలుగు వారియర్స్ లో తమన్, అశ్విన్, అఖిల్ బ్యాటింగ్ మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు