ప్రేక్షక దేవుళ్ళందరికీ ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు – మహానటి !
Published on Aug 16, 2018 12:27 pm IST

అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘మహానటి’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఏడాదిలో భారీ విజయాలు సాధించిన చిత్రాల్లో ఇది కూడ ఒకటి. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించగా ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాతో మరోసారి తన ఉనికిని ఘనంగా చాటుకుంది.

కాగా, ఇప్పుడు ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ రోజుతోటి మహానటి చిత్రం వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటూ ‘మీ ఆశీర్వచన బలంతో, ఆదరాభిమానాలతో ప్రపంచవ్యాప్త విజేతగా నిలిచి, 100 రోజుల పండుగ జరుపుకుంటున్న ఈ శుభసందర్భంలొ ప్రేక్షక దేవుళ్ళందరికీ ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook