
దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఓ 5 నిమిషాల పాత్రలో మెగాస్టార్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై కనపడనున్న సినిమా మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 9వ సినిమా ‘బ్రూస్ లీ’. టైటిల్ కి తగ్గట్టుగానే ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. ఈ రోజు అర్ధరాత్రి బ్రూస్ లీ ఫ్యాన్స్ షోకి అన్ని కార్యక్రమాలు సిద్దం అయ్యాయి. మెగా ఫ్యాన్స్ కళామందిర్ వారితో కలిసి మూసాపేట్ శ్రీరాములు థియేటర్ లో వేస్తున్న ఈ చారిటీ షోని మునుపెన్నడూ లేని విధంగా ప్లాన్ చేస్తున్నారని, ఫ్యాన్స్ షో నుంచి లైవ్ కవరేజ్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారని ఇది వరకే తెలియజేశాం.
ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేసిన బ్రూస్ లీ బెనిఫిట్ షోకి చాలా మంది స్టార్స్ కూడా రానున్నారు. ఎవరెవరు రానున్నారు అనే విషయానికి వస్తే.. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, దిల్ రాజు, గోపీచంద్ మలినేని, శ్రీను వైట్ల, ఎస్ఎస్ తమన్, కోన వెంకట్, గోపి మోహన్, సందీప్ కిషన్, రావు రమేష్, డివివి దానయ్యలతో పాటు సినిమాలో నటించిన పలువురు నటీనటులు కూడా ఈ సినిమాలో హాజరు కానున్నారు. ఇంతమంది స్టార్స్ మరియు గ్రాండ్ గా బెనిఫిస్త్ షోని ప్లాన్ చేయడం వాళ్ళ భారీ రేటుకే ఈ బెనిఫిట్ షో టికెట్స్ అమ్ముడుపోయాయి.
రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. భారీ అంచనాల నడుమ రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలా ఉంటుందనేది తెలియడానికి మరి కొద్ది గంటలు మాత్రమే బాలన్స్ ఉంది.