సెన్సార్ పూర్తీ చేసుకున్న గుణ 369 మూవీ.

సెన్సార్ పూర్తీ చేసుకున్న గుణ 369 మూవీ.

Published on Jul 25, 2019 6:45 PM IST

హీరో కార్తికేయ, అనఘా జంటగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “గుణ 369”. దర్శకుడు అర్జున్ జంధ్యాల రోమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. హీరో కార్తికేయ తన గత చిత్రాలకు భిన్నంగా గుణ 369 లో కనిపిస్తున్నాడు.ప్రేమ కోసం పోరాటం సాగించే యువకుడిగా తన పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. ఆగస్టు 2న విడుదలకు సిద్దమైన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

సెన్సార్ సభ్యులు గుణ 369 చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. కార్తికేయ గత చిత్రం హిప్పీ ఆశించినంతగా విజయం సాధించకపోవడంతో ఈ మూవీ విజయంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. స్ప్రింట్ మీడియా,జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా,చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు