ఇంట్రెస్టింగ్ గా “చారీ 111” ట్రైలర్!

ఇంట్రెస్టింగ్ గా “చారీ 111” ట్రైలర్!

Published on Feb 12, 2024 3:05 PM IST

ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన స్పై యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చారీ 111. మార్చ్ 1, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ పూర్తిగా ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. మొదటి నుండి చివరి వరకు ఆసక్తిని రేపుతోంది ఈ ట్రైలర్. ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటించిన మురళి శర్మ, సంయుక్త విశ్వనాథన్ ల పాత్రలో ట్రైలర్ లో ఆకట్టుకుంటున్నాయి.

బర్కట్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ చిత్రానికి సిమోన్ కే. కింగ్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటి వరకూ మంచి రెస్పాన్స్ రావడం తో, సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు