నారా రోహిత్ పీరియాడిక్ మూవీ మొదలు !

నారా రోహిత్ పీరియాడిక్ మూవీ మొదలు !

Published on Nov 23, 2018 7:20 AM IST

Chaitanya nara rohit
చెైతన్య దంతులూరి దర్శకత్వంలో ‘నారా రోహిత్’ హీరోగా 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి షూట్ కి వెళ్ళనుందని తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నారు.

వాస్తవానికి చెైతన్య దంతులూరి ‘బాణం’ చిత్రంతోనే దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ… ఆ తరువాత ‘బసంతి’తోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేసినప్పటికీ.. చెైతన్య దంతులూరికి మాత్రం సరైన సక్సెస్ దక్కలేదు. ఆ లోటును ఈ సారి ఎలాగైనా తీర్చుకోవాలని.. ఇప్పుడు చెయ్యబోయే సినిమాతో భారీ సక్సెస్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఈ పీరియాడిక్ స్టోరీని ఎంచుకున్నాడు.

అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు