నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని భారీ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండియర్ గా అత్యధిక వ్యయంతో నిర్మించారు. దసరా మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు టీజర్, సాంగ్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి.
ముఖ్యంగా టీజర్ లో నాని యాక్టింగ్, మాస్ స్టైల్, డైలాగ్స్ కి విశేషమైన స్పందన లభించింది. ఇక ఈ మూవీ నుండి ఐదు రోజుల క్రితం రిలీజ్ అయిన చమ్కీల అంగీలేసి అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఢీ, రామ్ మిరియాల ఎంతో అద్భుతంగా పాడిన ఈ సాంగ్ కి ముఖ్యంగా యువత తో పాటు మాస్ ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ 20 ట్రెండింగ్ సాంగ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈమూవీ మంచి సక్సెస్ సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది దసరా యూనిట్
#ChamkeelaAngeelesi from #Dasara is #1 among Top 20 Trending Songs on YouTube India ????????
Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @LyricsShyam @saregamasouth pic.twitter.com/3m9ZfKeSZ1
— SLV Cinemas (@SLVCinemasOffl) March 13, 2023


