ఘట్టమనేని కుటుంబం నుంచి పరిచయం అవుతున్న యువ హీరో జయకృష్ణ ఘట్టమనేని చేస్తున్న లేటెస్ట్ సినిమానే “శ్రీనివాస మంగాపురం”. టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్సమెంట్ నుంచే మంచి బజ్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్ గా నటిస్తూ ఆమె కూడా తెలుగు సినిమాకి పరిచయం అవుతుంది.
మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై ఓ క్లారిటీ అయితే రేపు రానుంది. ఎందుకంటే మేకర్స్ సినిమా తాలూకా టీజర్ ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రేపు ఏప్రిల్ 15న సాయంత్రం 6 గంటలకి విడుదల చేస్తున్నట్టు యంగ్ హీరోపై ఓ రిఫ్రెషింగ్ లుక్ పోస్టర్ తో రివీల్ చేశారు. సో ఈ సినిమాపై ఒక బేసిక్ ఐడియా రేపు వస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో నరేష్, మోహన్ బాబు తదితరులు నటిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వైజయంతి మూవీస్ సమర్పణలో ఈ సినిమా రాబోతుంది.
Two hearts rooted in innocence…
A story soaked in intensity.#SrinivasaMangapuram Teaser out Tomorrow at 6PM ❤️🔥Get ready to witness the world unfold💥 pic.twitter.com/JnTm7tjOyw
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 14, 2026


