ఓటీటీ డీల్ ముగించుకున్న ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఓటీటీ డీల్ ముగించుకున్న ఛాంపియన్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Published on Dec 24, 2025 7:00 AM IST

ఛాంపియన్

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ‘ఛాంపియన్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 25, 2025న క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు చిత్రబృందం నిర్ణయించింది. గతంలో ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందD’ వంటి సినిమాలతో మెప్పించిన రోషన్, ఈ సారి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

​ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ విషయంలో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఈ చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడిన అనంతరం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమాపై ఉన్న భారీ అంచనాల వల్లే ఓటీటీ డీల్ ఇంత భారీ స్థాయిలో కుదిరినట్లు తెలుస్తోంది.

​ఈ సినిమా ద్వారా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ మరియు కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రియాంక దత్, జి.కె మోహన్, జెమిని కిరణ్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు