యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య ఇంకా రెండు రోజులలో విడుదల కానుంది. దర్శకుడు తిరు తెరకెక్కించిన చాణక్య మూవీ ఏ కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా మెహ్రీన్ ఫిర్జా గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తిరు పాత్రికేయుల నిన్న సమావేశంలో పాల్గొని మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఐతే ఈ సంధర్భంగా చాణక్య మూవీ హాలీవుడ్ మూవీకి కాపీ అని ఆరోపణలు వస్తున్నాయి, దీనికి మీరేమంటారు? అని ఓ విలేకరి అడుగగా.., తిరు ఆ వార్తలను ఖండించారు. మాది ఏ హాలీవుడ్ మూవీకి కాపీ కాదు, అలాగే సల్మాన్ నటించిన ఏక్తా టైగర్ చిత్రంతో కూడా చాణక్య మూవీని పోలుస్తున్నారు. నిజానికి ఆ చిత్రాలతో చాణక్య చిత్రానికి ఎటువంటి పోలికలు ఉండవు. ఐతే మీరు చెప్పిన ఆ చిత్రాలు కూడా రా ఏజెంట్స్ పై తెరకెక్కిన స్పై చిత్రాలు కావడం వలన అలా అపార్థం చేసుకుంటున్నారు. చాణక్య పూర్తిగా ఓ కొత్త కథ, ఆవిషయం మీకు సినిమా చూస్తే తెలుస్తుంది అన్నారు.


