టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘చాణక్య’ !

టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘చాణక్య’ !

Published on Sep 9, 2019 9:05 PM IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో వస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్న ఈ టీజర్ మొత్తానికి సినిమా పై అంచనాలను పెంచింది. టీజర్ చూస్తుంటే ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయని అనిపిస్తోంది. అలాగే ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయనేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు. కాగా గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు