నెలాఖ‌రుకి ‘చాణ‌క్య‌’ టాకీ పార్ట్ పూర్తి చేస్తాడట !

నెలాఖ‌రుకి ‘చాణ‌క్య‌’ టాకీ పార్ట్ పూర్తి చేస్తాడట !

Published on Jul 13, 2019 11:07 PM IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణ‌క్య‌`. మొన్నటివరకూ హైద‌రాబాద్‌ లో ఈ చిత్రం శరవేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. కాగా ఈ సినిమా ఈ నెలాఖ‌రుకి టాకీ పార్ట్ పూర్తి చేసుకుంటుంది. వచ్చే నెలలో జరిగే షెడ్యూల్ లో మిగిలిన మూడు సాంగ్స్ ను చిత్రీకరించనున్నారు. ఇక రీసెంట్‌ గా విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు. గోపీచంద్‌ సరసన మెహ‌రీన్ జ‌త‌గా న‌టిస్తోంది.

విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు