వరుసగా మూడు సినిమాలు పరాజయం చెందడంతో రేపు శనివారం విడుదలకానున్న ‘చాణక్య’ మీదే ఆశలు పెట్టుకున్నాడు గోపిచంద్. తిరు దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ ను సుంకర రామబ్రహ్మం నిర్మించారు. ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ మెగాస్టార్ ‘సైరా’ బాక్స్ ఆఫీస్ ముందు భీభత్సం సృష్టిస్తోంది. వర్కింగ్ డేస్ లోనే చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
అలాంటిది శని, ఆదివారాల్లో సినిమా ప్రభావం బాక్స్ ఆఫీస్ మీద మరింతగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఏ మీడియం సినిమా విడుదలైనా ఓపెనింగ్స్ పరంగా తీవ్రమైన ఇబ్బంది తప్పదు. ఇప్పుడు ‘చాణక్య’కి కూడా ఈ బెడద ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు సినిమాకు తొలిరోజు మంచి మౌత్ టాక్ వస్తే తప్ప లాంగ్ రన్ కష్టం. మరి ఈ ఇబ్బందుల్ని ‘చాణక్య’ ఎలా అధిగమిస్తాడో చూడాలి.


