డబ్బింగ్ మొదలెట్టిన ‘చాణక్య’ !

డబ్బింగ్ మొదలెట్టిన ‘చాణక్య’ !

Published on Aug 14, 2019 10:17 PM IST

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ చాణక్య. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర
నిర్మాతగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మూవీ మేకర్స్ పాటలను
విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు. మరో పక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. మరి గోపీచంద్ కి ఈ సినిమానైనా భారీ హిట్ ఇస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు