ఐపీఎల్ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన చాందిని చౌదరి

ఐపీఎల్ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన చాందిని చౌదరి

Published on Apr 30, 2024 12:26 AM IST

అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. తాజాగా ఈ మూవీ యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏది అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు గాను బదులిచ్చిన చాందిని చౌదరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిజానికి తాను ఇప్పటికీ లైవ్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచులు చూడలేదని, త్వరలో చూస్తానని, అలానే తమ ఆంధ్రప్రదేశ్ కి ఐపీఎల్ లో టీమ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎవరికీ సపోర్ట్ లేదని సమాధానం ఇచ్చారు. అదేంటీ హైదరాబాద్ ఉంది కదా అని ఆ విలేఖరి అడగడంతో అది మా రాష్ట్రం కాదని చాందిని చెప్పడం ఎస్ఆర్ హెచ్ టీమ్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. భాగ్యనగరంలో ఉంటూ ఇక్కడే కెరీర్ ని నిర్మించుకుని కనీసం మాట వరసకు మద్దతు తెలుపకపోవడం ఏంటని ఆమెను పలు సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా విమర్శించడం మొదలుపెట్టారు.

ఇక తాజాగా ఆ వ్యాఖ్యలపై తన ట్విట్టర్ ప్రొఫైల్ ద్వారా క్లారిటీ ఇచ్చారు చాందిని. నా ఫేవరెట్ ఐపిఎల్‌ ఓం ఏదని అడిగితె నేను మ్యాచ్‌ లు చూస్తా, కాబట్టి చూశాకనే చెబుతా అన్నాను. అలాగే నేను ఆంధ్ర అమ్మాయిని కాబట్టి ఆంధ్ర టీం కూడా ఉంటే బాగుండు అన్నాను. అయితే ట్రెండింగ్ కంటెంట్‌ కి తగ్గట్టు వీడియో ఎడిట్‌ చేసి అవుట్‌ ఆఫ్‌ కాంటెక్స్స్‌ లో వీడియోలు పెట్టడం చాలా సులభం కదా అని అంటూ ఆమె చెప్పుకొచ్చారు. నేను నా రెండు తెలుగు రాష్ట్రాలను చూసి గర్విస్తా, ఎందుకంటే నేను ఆ రెండు రాష్ట్రాలకు చెందిన దాన్ని కాబట్టి, ఈ ఏడాది హైదరాబాద్‌ జట్టుకి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ ఆమె తన పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు