‘ఎన్టీఆర్’గా నటించబోతున్న ‘సీఎం’ మనవడు !

Published on Feb 11, 2019 9:44 pm IST

ఇటీవలే షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకున్న ‘మహానాయకుడు’కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్, ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. గత వారమే దేవాన్ష్‌ కి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారట. ప్రస్తుతం ‘మహానాయకుడు’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.

అయితే జనవరి 9న విడుదలైన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం మహానాయకుడు స్క్రిప్ట్ లో చాల మార్పులు చేశారు. కొన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ.. ‘మహానాయకుడు’ని తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :