‘మహానాయకుడు’ని ముందే చూడబోతున్న చంద్రబాబు !

Published on Feb 8, 2019 1:00 am IST

మొత్తానికి భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం ‘మహానాయకుడు’ ఫై ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే స్క్రిప్ట్ లో ఎక్కడా లాగ్ లేకుండా.. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ.. మొత్తానికి ‘మహానాయకుడు’కి బాగానే తీర్చి దిద్దుతున్నారు.

పైగా ‘మహానాయకుడు’లో చంద్రబాబు పాత్ర చాలా కీలకమైనది. అందుకే ‘మహానాయకుడు’ రఫ్ ఎడిటింగ్ అయిపోగానే చిత్రబృందం చంద్రబాబుకు ప్రత్యేకంగా షో వేసి చూపించనున్నారు. ఇక ఈ సినిమాను మార్చి 1వ తేదీన విదుదల చేస్తారని తెలుస్తోంది.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :