
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ సినీ గేయ రచయితగా, ఆస్కార్ విజేతగా పేరు తెచ్చుకున్న చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేంద్ర (కనుకుంట్ల రాజేంద్రప్రసాద్) మృతి చెందారు. నిన్న ఉదయం అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటనతో చంద్రబోస్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వృత్తిరీత్యా బెంగళూరులో స్థిరపడిన రాజేంద్ర, వ్యాపార పనుల నిమిత్తం శనివారం అన్నమయ్య జిల్లాలోని కలికిరికి వెళ్లారు.
అక్కడే స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన, సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అనంతరం సమీపంలోని ఒక హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రాజేంద్ర మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు చంద్రబోస్‌కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.