సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించింది. దీంతో, సహజంగానే జైలర్-2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గానే రేట్లు చెబుతున్నారు మేకర్స్. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం జైలర్-2కు 60 కోట్ల రూపాయలు ఫిక్స్ చేశారట. మరి ఈ సినిమాకి ఇంత మొత్తానికి బిజినెస్ జరుగుతుందా అనేది డౌటే. మరోవైపు జైలర్-2 జూన్ 12న థియేటర్లలోకి రాబోతుంది.
ఏది ఏమైనా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ పార్ట్ 2 భారీ హైప్ ని సెటప్ చేసుకుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ పార్ట్ లో కూడా సాలిడ్ క్యామియోలు ఉన్నాయట. ఇక ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విగ్రహాలు స్మగ్లింగ్ చేసే సిండికేట్‌కు ఎదురెళ్లే రిటైర్డ్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు.
