‘ఆటిట్యూడ్ స్టార్’ చంద్రహాస్, మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్‌లో జరిగిన కోలాహలమైన వేడుకలో చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 6న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్టెప్పులేసిన హీరో హీరోయిన్లు, సినిమా విజయంపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్యూర్ ఎంటర్‌టైనర్ ఇదని, ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ఆసక్తికరమైన గొడవలే ఈ కథని దర్శకుడు సంపత్ రుద్ర తెలిపారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలకు యూత్ నుంచి మంచి స్పందన లభించింది.
ఈ చిత్రంలో అర్జున్ మహీ ప్రతినాయకుడిగా నటిస్తుండగా మురళీధర్ గౌడ్, మధునందన్, అభయ్ నవీన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు వైఆర్ శేఖర్ సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
