చంద్రహాస్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ లిరికల్ వీడియో రిలీజ్

కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో వర్షిక పాశం కథానాయికగా నటిస్తున్నారు. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలోని ‘చిల్లర సాంగ్’ లిరికల్ వీడియోను నటుడు చంద్రహాస్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్. సుహాస్ ఈ పాటకు సంగీతం సమకూర్చడంతో పాటు స్వయంగా ఆలపించారు. సాహిత్యాన్ని గణేష్ బొడ్డ, సుహాస్ సంయుక్తంగా అందించారు. ఈ చిత్రానికి రాజ్ నోముల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version