ఇండియన్ సినిమా దగ్గర నుంచి కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ఖండాంతరాలు దాటి మంచి గుర్తింపు తెచ్చుకుంటాయి. అలా కోలీవుడ్ నుంచి విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు నిథిలన్ తెరకెక్కించిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం మహారాజా కూడా ఒకటిగా నిలిచింది. తెలుగు తమిళ్ లో మంచి వసూళ్లు సాధించి అదరగొట్టిన ఈ సినిమా ఆ మధ్య చైనాలో కూడా విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ సాధించింది.
ఇలా టోటల్ గా 200 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా హాలీవుడ్ లో రీమేక్ కానుంది అన్నట్టు పలు రూమర్స్ వినిపించాయి.
ఇప్పుడు ఫైనల్ గా ఈ రూమర్స్ నిజం చేస్తూ తమ మహారాజ ఓ పాపులర్ హోలీవుడ్ నిర్మాణ సంస్థ సారథ్యంలో రీమేక్ కాబోతున్నట్టు గర్వంగా కన్ఫర్మ్ చేసారు. దీనితో ఈ అరుదైన ఫీట్ సాధించిన సినిమాగా మహారాజ హిస్టరీ సెట్ చేసింది. ఓ హాలీవుడ్ స్టార్ హీరో తోనే ఈ సినిమా చేయనున్నట్టుగా టాక్. సో వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
A HISTORIC MILESTONE! 🔥#Maharaja becomes the first Tamil film to be made in Hollywood by a major studio ❤️🔥#MakkalSelvan @VijaySethuOffl
Written and Directed by @Dir_Nithilan@anuragkashyap72 @mamtamohan @Natty_Nataraj @Abhiramiact @AjaneeshB @Philoedit @DKP_DOP… pic.twitter.com/FZSY0QA1r1
— Passion Studios (@PassionStudios_) September 16, 2026
