సూపర్ స్టార్ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్

సూపర్ స్టార్ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్

Published on Jan 3, 2020 3:14 PM IST

chandramukhi

సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ చిత్రాల్లో ‘చంద్రముఖి’ ఒకటి. హర్రర్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా 20015లో విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది. కన్నడ వెర్షన్ ‘ఆప్తమిత్ర’ను డైరెక్ట్ చేసిన పి.వాసు ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనుకున్న వాసు ఆ ప్రయత్నాన్ని మొదట తెలుగులో ట్రై చేసి వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నాగవల్లి’ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇప్పుడు ఈ ప్రయత్నం తమిళంలో జరగనుంది. అధికారికంగా ప్రాజెక్ట్ అనౌన్స్ కాకపోయినా సీక్వెల్ పనులైతే వేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ కొనసాగింపులో ప్రధాన పాత్రదారులు ఎవరనేది కూడా ఇంకా ఫైనల్ కాలేదట. సో..’చంద్రముఖి’లో రజనీ, ప్రభు, జ్యోతిక, కె.ఆర్.విజయ, నయనతార లాంటి స్టార్లను తీసుకున్న డైరెక్టర్ పి.వాసు ఈ సెక్వెల్ కోసం ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు