శరవేగంగా రామ్ చరణ్ నిశ్చితార్థ ఏర్పాట్లు

శరవేగంగా రామ్ చరణ్ నిశ్చితార్థ ఏర్పాట్లు

Published on Nov 29, 2011 9:13 AM IST


రామ్ చరణ్ నిశ్చితార్థ వేడుక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేడుకని భారీగా చేయనున్నట్లు, చిరంజీవి కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నట్లు విశ్వనీయవర్గాల సమాచారం. చైనాలో రచ్చ షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవలే చరణ్ ఇండియాకి వచ్చారు.

ఈ వేడుకకి చిరంజీవి కుటుంబం అక్కినేని నాగేశ్వర్ రావు, డాక్టర్ డి.రామానాయుడు, బాలకృష్ణ, నాగార్జున మరియు మరికొంతమంది ఇండస్ట్రీ పెద్దలని ఆహ్వానించినట్లు సమాచారం. రామ్ చరణ్-ఉపాసన కామినేనిల నిశ్చితార్థ వేడుక గోల్కొండ రిసార్ట్స్లో జరగనుంది. ఈ వేదికను అంగరంగవైభవంగా తీర్చిదిద్దినట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు