చరణ్ శంకర్ ప్రాజెక్ట్..జస్ట్ గాసిప్ కే దుమ్ము లేచిపోతుంది.!

Published on Mar 9, 2021 9:00 am IST

ప్రస్తుతం మన దక్షిణాది నుంచి రానున్న పలు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో జస్ట్ అనౌన్సమెంట్ తోనే సెన్సేషన్ ను నమోదు చేసిన శంకర్ అండ్ చరణ్ ల ప్రాజెక్ట్ కూడా ఒకటి. కొన్నాళ్ల నుంచి బజ్ గా ఉన్న ఆ భారీ కాంబో కన్ఫర్మ్ అయ్యింది అన్న యుఫోరియానే ఓ లెవెల్లోకి వెళ్ళింది.

అయితే ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రానికి సంబంధించి మరో ఊహించని గాసిప్ వచ్చింది. అదే ఈ సినిమాలో కొరియన్ నటి బీ సుజీ ను తీసుకుంటున్నారని దీనితో ఈ సినిమా పాన్ ఆసియన్ లెవెల్లో తెరకెక్కుతోందని ఓ టాక్ వచ్చింది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ఈ బజ్ మాత్రం ఈ కాంబోను మరో లెవెల్లోకి పెట్టింది.

ఈ న్యూస్ ను అక్కడి మీడియాలోనే కవర్ చెయ్యడమే కాకుండా కోలీవుడ్ వర్గాల్లో హాట్ హాట్ చర్చగా రచ్చ చేసింది. మొత్తానికి మాత్రం నిజమో కాదో తెలియని గాసిప్ గట్టిగానే ట్రెండ్ అవుతూ వస్తుంది. అలాగే ఈమె కన్ఫర్మ్ అన్నట్టే సూచనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :