చిరంజీవి రికార్డుని బద్దలుకొట్టిన రామ్ చరణ్ !

గత శుక్రవారం విడుదలైన ‘రంగస్థలం’ చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా కొత్త ఎత్తులకి ఎదగడమేకాకుండా కలెక్షన్ల పరంగా పలు పాత రికార్డుల్ని బ్రేక్ చేస్తున్నారు. ఈ చిత్రంతో ఓవర్సీస్లో మొదటిసారి 2 మిలియన్ల క్లబ్లోకి చేరిన చరణ్ పాత సినిమాల లెక్కల్ని వెనక్కి నెట్టేస్తున్నారు.

ఇప్పటికే వరకు యూఎస్ టాప్ తెలుగు గ్రాసర్ల జాబితాలో 2.44 మిలియన్లతో 4వ స్థానంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘ఖైదీ నెం 150’, నితిన్ ‘అ ..ఆ’ చిత్రాలను 2.46 మిలియన్ డాలర్లతో అధిగమించాడు చరణ్. ఇక 2.89 మిలియన్లతో మూడవ స్థానంలో ఉన్న మాహేష్ యొక్క ‘శ్రీమంతుడు’ను కూడ ‘రంగస్థలం’ ఇంకో రెండు రోజుల్లో క్రాస్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.