శ్రీకారం కథ విన్నప్పుడు చేయాలి. అది ఒక బాధ్యత అనిపించింది. – శర్వానంద్.

శ్రీకారం కథ విన్నప్పుడు చేయాలి. అది ఒక బాధ్యత అనిపించింది. – శర్వానంద్.

Published on Mar 7, 2021 12:51 AM IST

శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు, ట్రైలర్స్ కి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. హై ఎక్స్ పెక్టేషన్స్ తో మహాశివరాత్రి సందర్బంగా మార్చి 11న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు కిషోర్ బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట. రైటర్ సాయి మాధవ్ బుర్రా పాల్గొన్నారు. మార్చి 6 హీరో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.

హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ – ‘‘సినిమా గురించి మాట్లాడాలి అంటే..సాయిమాధవ్‌ బుర్రాగారు చెప్పినట్లు…ఈ కథ విన్నప్పుడు చేయాలి. ఇది ఒక బాధ్యత అనిపించింది. ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు. రైతులు పడిస్తే కానీ తినలేం. పండించే
వారు తక్కువై పోతున్నారు. తినేవారు ఎక్కువై పోతున్నారు. ఇంత మంచి కథ రాసుకున్నందుకు థ్యాంక్స్‌ కిశోర్‌. కమర్షియల్‌ సినిమాలు చేయడం ఈజీ. కానీ నిర్మాతలు శ్రీకారంలాంటి సినిమాను నమ్మడం ఇంత ఖర్చు పెట్టడం చాలా కష్టం. డేరింగ్‌గా ఉంటేనే ఇలాంటి చేస్తారు. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. అన్నారు
నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ – ‘‘శ్రీకారం సినిమా మార్చ్‌ 3న సెన్సార్‌ పూర్తయింది. 11న మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తున్నాం. శ్రీకారం చాలా పాజిటివ్‌ టైటిల్‌. ఒక యువరైతు కథ. స్ట్రాంగ్‌ డైలాగ్స్, బలమైన ఎమోషన్స్‌తో ఈ సినిమాను చేశాం. శర్వా క్యారెక్టర్‌లో జీవించారు. కరోనా వల్ల సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ వచ్చినా కూడ సినిమా స్టార్టింగ్‌లో చూపించిన ఎగై్జట్‌మెంట్‌నే చూపించారు.

డైరెక్టర్‌ కిశోర్‌. బి మాట్లాడుతూ –‘‘మనందరం దాదాపు వ్యవసాయ కుటుంబాల నుంచే వచ్చినవాళ్లుం ఉంటాము. ఎక్కడో ఒక చోట మనం కనెకై్ట ఉంటాము. మనల్ని మనం స్క్రీన్‌ పై చూసేందుకు ఈ నెల 11న వస్తున్నాం. సినిమా చూస్తున్నప్పుడు మన కథో, మన పక్క ఊరి కథో ఏదో ఒకటి చూస్తున్న భావన కలుగుతుంది. నన్ను సపోర్ట్‌ చేసిన శర్వానంద్‌గారికి థ్యాంక్స్‌. రైటర్ సాయిమాధవ్‌బుర్రా మాట్లాడుతూ – ‘‘ శర్వానంద్‌గారికి మళ్ళీ మళ్లీ రాని రోజు సినిమా తర్వాత శర్వానంద్‌గారితో శ్రీకారం సినిమా చేశాను. రైతు బ్యాక్‌డ్రాప్‌ సినిమా ఇది. కిశోర్‌ కథ చెప్పిన వెంటనే ఈ సినిమా చేయాలి అని అనుకున్నాను. ఇలాంటి సినిమా చేయడం నా బాధ్యత. ఒక సంతోషాన్నిచ్చే సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కిశోర్‌ మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. తొలి సినిమాయే అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా చేశాడు. ఈ భూమి మీద పైసా కూడ దోచుకోలేనిది ఒక్క రైతు మాత్రమే. తండ్రికి, కొడుక్కు మధ్య ఉన్న ప్రేమకథ ఈ చిత్రం భూమికి మనిషికీ మధ్య ఉన్న ప్రేమకథ ఈ చిత్రం అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు