ఈసారి రాజమౌళి డిసప్పాయింట్ చేయరుకదా

Published on Feb 28, 2020 10:11 am IST

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రాజమౌళి సినిమా కోసం భారీగా డేట్స్ కేటాయించడం, ఆ చిత్రం పూర్తయ్యాకే వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అవ్వడంతో ఆ హీరోల అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఎప్పుడెప్పుడు తమ హీరోల ఫస్ట్ లుక్స్ విడుదలవుతాయా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఫస్ట్ లుక్స్ వస్తాయని ఆశించిన వారికి ప్రతిసారి నిరాశే ఎదురవుతూ వచ్చింది. ఎన్ని పండుగలు వచ్చినా జక్కన్న మాత్రం ఎలాంటి లుక్స్ వదల్లేదు.

కానీ మార్చ్ నెలలో మాత్రం పెద్ద సప్రైజ్ కన్ఫర్మ్ అని అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే మార్చ్ నెలలో అప్డెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తెలిపింది. దీంతో మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు కాబట్టి ఆరోజున చెర్రీ చేస్తున్న సీతారామరాజు పాత్రకు సంబంధించిన అప్డేట్ ఖాయమని ఫ్యాన్స్ ఆభిప్రాయపడుతున్నారు. మరి వారి ఆశను రాజమౌళి ఈసారైనా తీరిస్తే బాగుంటుంది. ఇకపోతే ఈ చిత్రం 2021 జనవరి 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More