
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి మంచి కథలను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. రామ్ చరణ్ ఇప్పటికే రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఈ సంవత్సరంలోనే వాటిని ఫినిష్ చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాని కూడా ఈ ఏడాది మొదలు పెట్టే పనిలో ఉన్నాడు. రామ్ చరణ్ శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేయనున్న తదుపరి సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కథని అందిస్తున్నారు.
‘రామ్ చరణ్ – సమంత – శ్రీను వైట్ల గారి సినిమాకి మంచి కథని అందించాం. శ్రీను వైట్ల గారు ఆ కథకి సరికొత్త కథనం రూపకల్పన చేస్తున్నారు. మా కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల లాగానే కామెడీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పటిలానే బ్రహ్మానందం పాత్ర హైలైట్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మా గత సినిమాల మార్క్ ఎక్కడా కనిపించకుండా ఉండేలా కేర్ తీసుకున్నాం. ఇది కాకుండా రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి 6 నెలలు మాతో ఒకత రాయించాడు. దాని గురించి త్వరలోనే తెలియజేస్తామని’ గోపి మోహన్ తెలిపాడు.