ఆఫ్రికా వెళ్లిన చరణ్ ఏంచేస్తున్నాడో తెలుసా?

Published on May 29, 2019 4:30 pm IST

రామ్ చరణ్ “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ సమయంలో కాలికి తగిలిన గాయం నుండి మెల్లగా కోలుకుంటున్నాడు. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణకు కొంత విరామం రావడంతో కొంచెం రిలాక్స్ అవుదాం అని భావించిన రామ్ చరణ్ వెకేషన్ కొరకు విదేశాలు వెళ్ళాడట.

ప్రస్తుతం రామ్ చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా టూర్ ఎంజాయ్ చేస్తున్నారని సమాచారం. ఆఫ్రికా ఖండంలో జీవవైవిధ్యానికి పేరుగాంచిన టాంజానియా లోని సెరెంగెటి నేషనల్ పార్క్ కి వెళ్లిన ఈ జంట, అక్కడ వైల్డ్ యానిమల్స్ ని దగ్గరగా చూస్తూ తెగ సంబరపడిపోతున్నారంట. ఈ పార్క్ ముఖ్యంగా జీబ్రాలకు చాలా ఫేమస్. ఇలాంటి టూర్లు చాలా రిస్క్ తో కూడుకున్నవి. ఇలాంటి రిస్కీ ప్లేసెస్ కి వెళుతున్న చరణ్ ,ఉపాసనలు అభినందించాల్సిందే.

ఈ టూర్ నుండి వచ్చిన వెంటనే నిరవధికంగా కొనసాగనున్న “ఆర్ ఆర్ ఆర్”షూటింగ్ లో చరణ్ పాల్గొననున్నాడు.

సంబంధిత సమాచారం :

More