ఆ విషయాన్ని చరణ్ నమ్మలేకపోతున్నారట.

ఆ విషయాన్ని చరణ్ నమ్మలేకపోతున్నారట.

Published on Jul 31, 2019 1:30 PM IST

దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఎపిక్ మూవీ “మగధీర” 10ఏళ్ళు పూర్తిచేసుకుంది. రాజమౌళి రాంచరణ్ ని భైరవగా, కాజల్ ని మిత్ర విందాగా తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఇక రెండు తరాలలో రామ్ చరణ్,కాజల్ నటన చిత్రానికి హైలెట్ గా నిలిచింది. మగధీర అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డ్స్ ని తుడిచిపెట్టింది. ఇతర భాషలలో కూడా ఈ చిత్రం ఊహించని ఆదరణ దక్కించుకుంది.

ఈ సందర్భంగా హీరో రాంచరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మగధీర సినిమా వచ్చి పదేళ్లు పూర్తి అయ్యిందంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ ఆ చిత్రం పై తాజా భావన కలుగుతుంది. ఇలాంటి అద్భుత చిత్రం కొరకు పనిచేసిన బృందం,కాజల్ కి,కీరవాణి గారికి, గీతా ఆర్ట్స్ కి ధన్యవాదాలు . ముఖ్యంగా రాజమౌళి గారికి, మీదగ్గర ఆ చిత్ర సమయంలో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు “ఆర్ ఆర్ ఆర్” తో అది కొనసాగిస్తున్నాను అని అర్థం వచ్చేలా సందేశం పోస్ట్ చేశారు.

మళ్ళీ ఇన్నేళ్ల తరువాత రాంచరణ్,రాజమౌళి కలిసి “ఆర్ ఆర్ ఆర్” కొరకు పనిచేస్తున్నారు. మరో స్టార్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు