చరణ్ తో జత కట్టనున్న హన్సిక

చరణ్ తో జత కట్టనున్న హన్సిక

Published on Jan 10, 2012 10:30 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే ముద్దుగుమ్మ హన్సిక తో జత కట్టనున్నాడు. వి.వి.వినాయక దర్శకత్వం లో చరణ్ చేయబోతున్న మాస్ ఏక్షన్ చిత్రం లో చరణ్ డబల్ రోల్ చేస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ చిత్రానికి కాజల్ అగ్గార్వాల్ ను ప్రధాన హీరొయిన్ గా ఎంపిక చేసుకోవటం జరిగింది. తాజాగా రెండవ హీరోయిన్ గా హన్సిక ను ఖరారు చేసుకున్నట్లు గా విశ్వసనీయ వర్గాల సమాచారం.

యునివెర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలను అందిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల మొదటి వరం నుండి షూటింగ్ జరుపుకుంటుంది. నిర్మాతలు ఏక ధాటిగా షూటింగ్ ను జరిపి, సింగిల్ షెడ్యుల్ లో చిత్రాన్ని పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు