చరణ్ టైటిల్ తో రానున్న తమిళ స్టార్

vijay

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య భాషా భేదం తక్కువవుతోంది, అలాగే ప్రతి భాషలోని హీరో తమ మార్కెట్ పరిధిని పెంచుకోవడం కోసం ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అలా తెలుగు నుంచి తమిళంకి, తమిళం నుంచి తెలుగుకి వస్తున్న సినిమాల సంఖ్య పెరిగింది. తమిళ స్టార్ హీరో ఇలయథలపథి విజయ్ నటించిన పలు సినిమాలు ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా విజయ్ నటించిన పులి సినిమా కూడా తెలుగులో రిలీజ్ అయ్యింది. విజయ్ ప్రస్తుతం ‘రాజా రాణి’ ఫేం అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి తమిళంలో ‘థేరి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకి తెలుగులో ఓ టైటిల్ ని ఫిక్స్ చేసారు. థేరి సినిమాకి తెలుగు టైటిల్ ‘మెరుపు’. గతంలో ఇదే టైటిల్ ని రామ్ చరణ్ చేయబోయే ఓ సినిమాకి అనుకున్నారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఈ టైటిల్ ని విజయ్ సినిమా తెలుగు వెర్షన్ కి అనుకోవడం విశేషం. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తుంటే జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version