మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆగష్టులో యుకెకి వెళ్లనున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం చరణ్ చేస్తున్న ‘గోవిందుడు అందరివాడెలే’ సినిమా చివరి షెడ్యూల్ ని లండన్ లో ప్లాన్ చేసారు. లండన్ షెడ్యూల్ తో ఆ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.
ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రామ్ చరణ్ ఒక ఎన్నారై పాత్రలో కనిపించనున్నాడు. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ఓ హౌస్ సెట్ లో జరుగుతోంది.


