చరణ్, బోయపాటి సినిమా లేటెస్ట్ న్యూస్ !

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి షెడ్యూల్ పూర్తి చేసి, రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు బృందం రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 10 నుండి ప్రారంభం కానుంది. చరణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. తమిళ హీరో ప్రశాంత్, పాత హీరోయిన్ స్నేహ ఈ సినిమాలో చరణ్ అన్న వదినల పాత్రల్లో కనిపించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్, జర్నీ హీరోయిన్ అనన్య నటిస్తున్నారు.