చరణ్ సిక్స్ ప్యాక్ తో కనువిందు చేయనున్నాడా ?

చరణ్ సిక్స్ ప్యాక్ తో కనువిందు చేయనున్నాడా ?

Published on Jun 6, 2018 8:54 AM IST

యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను సినిమాలంటే యాక్షన్ మోతాదు ఎక్కువగానే ఉంటుంది. ఇక స్టార్ హీరోలతో అయన చేసే సినిమాల సంగతైతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానులకు కావాల్సినంత మాస్ మసాలా యాక్షన్ దొరుకుతుంది. అందుకే ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాపై అభిమానుల్లో బోలెడన్ని ఆశలు, అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలను అందుకోవడానికి చరణ్ తన వంతుగా సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ తో కనువిందు చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా కోసం చరణ్ ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ రాకేష్ ఉడియార్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ఆకట్టుకునే శరీరాకృతిలోకి మారారు. మరి నిజంగానే చరణ్ సిక్స్ ప్యాక్ లుక్ తో స్క్రీన్ పై కనబడితే అభిమానులకు పండుగనే చెప్పాలి.

కైరా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనుండగా స్నేహ, ప్రశాంత్ వంటి తమిళ తారలు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు