చిరుతను “చిరుత” ఫొటో తీస్తే…సూపర్ కదు…!

Published on May 30, 2019 8:41 am IST

చరణ్ ప్రస్తుతం భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికాలో వైల్డ్ లైఫ్ సఫారీ చేస్తున్నాడు. సాధారణంగా యంగ్ కపుల్ ఎవరైనా ప్రపంచంలోని రొమాంటిక్ ప్లేసెస్ అయిన స్విట్జర్లాండ్, లండన్, ఫ్రాన్ లాంటి ప్రదేశాలకు వెళతారు. కానీ ఈ సెలెబ్రిటీ కపుల్ మాత్రం విహార యాత్రకు బదులు సాహసయాత్రకు వెళ్లారు. వైల్డ్ లైఫ్ సఫారీ రిస్క్ తో కూడుకున్నది, చాలా మంది పర్యాటకులు ఇలాంటి సహస యాత్రలో ప్రమాదాల బారిన పడిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి ప్రమాదకరమైన సహస యాత్రలతో చరణ్ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

టాంజానియా లోని సెరిగేటి నేషనల్ పార్కులో చరణ్ చిరుత ను చాల దగ్గరగా ఫొటో తీస్తున్న ఫొటో సోషల్ మీడియా లో కొందరు షేర్ చేశారు. ఆ ఫోటో చూసిన ఫ్యాన్స్ తమ హీరో గట్స్ కి అబ్బురపడిపోతున్నారట. ఏమైనా మా హీరో గ్రేట్ అని చెప్పుకుంటున్నారట. చరణ్ ఈ టూర్ నుండి వచ్చిన వెంటనే “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ లో జాయిన్ అవుతారు.

సంబంధిత సమాచారం :

More