చరణ్ ‘బ్రూస్ లీ’ 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

చరణ్ ‘బ్రూస్ లీ’ 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

Published on Oct 26, 2015 10:10 PM IST

bruce-lee
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్రూస్ లీ’. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా ఓ 4 నిమిషాల పాటు తెరపై కనిపించి మెగా అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాడు. మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాకి దసరా సీజన్‌ కూడా తోడవడంతో ‘బ్రూస్ లీ’ సినిమాకి మొదటి వారం మరియు సెకండ్ వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. దసరా సీజన్ వలన అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్స్ ని రాబట్టుకొని దాదాపు డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేవ్ అయ్యేలా చేసింది. ఓవరాల్ గా బ్రూస్ లీ సినిమా మొదటి 10 రోజుల్లో ఒక్క ఏపి, తెలంగాణాలోనే 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఏరియా వైజ్ గా వచ్చిన మొదటి 10 రోజుల షేర్ వివరాలు మీకోసం..

ఏరియా  కలెక్షన్స్(షేర్)
నైజాం 9.10 crores
సీడెడ్ 6.32 crores
నెల్లూరు 1.57 కోట్లు
గుంటూరు 3.25 కోట్లు
కృష్ణా 1.99 కోట్లు
పశ్చిమ గోదావరి 2.25 కోట్లు
తూర్పు గోదావరి 2.92 కోట్లు
ఉత్తరాంధ్ర 4.15 కోట్లు
తెలంగాణ, ఏపి మొత్తం షేర్ 31.55 కోట్లు

తాజా వార్తలు